Wednesday, September 5, 2018

Sri Dattatreya Chalisa


ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీ దత్తాత్రేయ చాలీసా
ఓం



వల్లభాపురవాస దత్త ప్రభో
భక్తుల కాచే భగవంతా
జగద్గురుడవు నీవయ్య
జగతి కి మూలము నీవేనయ్యా ||1||

అత్రి మహాముని సంకల్పం
అనసూయాదేవి తపోబలం
అవని పైన నీ ఆగమనం
దివ్యమైన నీ విచిత్ర రూపం || 2||

మునులు దేవతలందరును
నీ రూపమును దర్శించి
అమితమైన ఆనందమును
పొంది ముక్తులు అయ్యిరయా || 3||

ప్రణవ స్వరూప   దేవా
వేదములను ప్రభోధించి
జ్ఞానులకే సుఙ్ఞానుమును
ఒసిగి వారల బ్రోచితివి || 4||

సాధకుడైన సాంకృతికి
అష్టాంగ యోగము బోధించి
యోగుల పాలిటి దైవము వై
యోగిరాజు వై నిలిచితివీ || 5||

బ్రహ్మదేవుని తలపునను
అక్షర పరబ్రహ్మ యోగమును
తెలిపి పునః సృష్టి కారణమైన
పరబ్రహ్మవు నీవేనయ్యా  ||6||

మంగళ రూపం ధరించి
శృంగారముగ భావించి
అంగనలతో  నీవుంటివని
భంగ పడెనయ్యా దేవేంద్రుడు  || 7||

నీ నిజరూపం తెలియగను
నీ మహిమలను స్మరియింప
నీ కృప వారిపై వర్షించి
నిజ తత్వమును తెలిపితివి || 8||

జంభాసురుని తాకిడికి
తాళగలేక పోతినని
దేవేంద్రుడు నిను ప్రార్థింప
అసురుని ద్రుంచిన అనఘాప్రియా || 9||

స్మర్తృగామి యని తెలుసుకొని
దలాదనుడు నిను స్మరియింప
ప్రత్యక్షంబై నిలచితివి
వజ్రకవచము బోధించితివీ || 10||

కార్తవీర్యుని రక్షించి
సహస్ర బాహుల బలమొసగి
అష్ట సిద్ధుల నిచ్చితివి
అమిత పరాక్రమము జేసితివి  || 11||

అశాంతి నొందిన రేణుక పుత్రుడు
శాంతి కోసమై అలమటించగా
సంవర్తనావధూత రూపమున
శాంతి నొసగి బ్రోచితివి || 12||

శ్రద్ధాభక్తి తో భార్గవరాముడు
నిన్ను దరిచేరి సేవించగా
త్రిపురా రహస్యం ప్రబోధించిన
త్రిశక్తి రూపుడు నీవేనయ్యా  || 13||

మదాలసా మాత సంకల్పం
అలర్కుడు నిను చేరగనే
ముప్పు తిప్పలు పెట్టితివి
మురిపెముతో దరిచేర్చితివి || 14||

బ్రహ్మరాక్షసుని సాయమున
విష్ణుదత్తుడు నిను చేరగనే
ముప్పుతిప్పలు పెట్టితివి
మురిపెముతో  దరి చేర్చితివి || 15||

విష్ణుదత్తుడు కోరగనే
పితృ కార్యమున కొచ్చితివి
సుశీలమ్మ  పిలువగనే
అనలు గు  - సూర్యుడు వచ్చిరయా || 16||

కోరిక లేమియు లేనట్టి
దంపతులని దీవించి
అద్భుతమైన మంత్రము నొసగి
జనహితకారిని చేసితివి || 17||

కాశీ లో నీ స్నానమట
కొల్హాపురి లో భిక్షమట
చంద్రభాగ లో చేతిని కడిగి
తుంగభద్ర లో నీటిని తాగి || 18||

సహ్యాద్రిపురమున వాసమట
మహూరుగడ లో నిద్రయట
చిత్రమయా నీ సంచారం
యోగీశ్వరేశ్వర చక్రవర్తీ || 19 ||

కలియుగ మందున శ్రీపాదుడై
గురుభక్తులను బ్రోచితివీ
నరసింహ సరస్వతీ స్వామిగ నీవు
గురుభక్తి ని ఇల చాటితివి || 20||

మాణిక్య ప్రభువుగ లీలలు చూపి
స్వామి సమర్దగా భక్తుల గాచి
సాయినాధుడై షిరిడీ లో వెలసి
ఆశ్రితులను గాపాడితివి  || 21 ||

నిరతము నిన్ను స్మరియించే
విఠలుడు పలికిన పలుకులివి
పలికిన వారిని పరిరక్షించు
వల్లభాపురవాస గురుదత్తా || 22 ||

శ్రీ గురుచరితము చదవండీ
సద్గురు శక్తిని తెలియండీ
భక్తి తో మీరు కొలవండీ
దత్త దేవా కృప పొందండీ || 23 ||

మంగళమయ్య గురుదేవా
సచ్చిదానంద సద్గురుదేవా
మంగళకరుడవు నీవయ్యా
భక్తుల బ్రోవుము గురుదత్తా

4 comments: