ఓం శ్రీ
గురు
దత్తాత్రేయాయ
నమః
శ్రీ దత్తాత్రేయ
చాలీసా
వల్లభాపురవాస
దత్త ప్రభో
భక్తుల
కాచే భగవంతా
జగద్గురుడవు
నీవయ్య
జగతి
కి మూలము నీవేనయ్యా ||1||
అత్రి
మహాముని సంకల్పం
అనసూయాదేవి
తపోబలం
అవని
పైన నీ ఆగమనం
దివ్యమైన
నీ విచిత్ర రూపం || 2||
మునులు
దేవతలందరును
నీ రూపమును దర్శించి
అమితమైన
ఆనందమును
పొంది
ముక్తులు అయ్యిరయా || 3||
ప్రణవ
స్వరూప ఓ దేవా
వేదములను
ప్రభోధించి
జ్ఞానులకే
సుఙ్ఞానుమును
ఒసిగి
వారల బ్రోచితివి || 4||
సాధకుడైన
సాంకృతికి
అష్టాంగ
యోగము బోధించి
యోగుల
పాలిటి దైవము వై
యోగిరాజు
వై నిలిచితివీ || 5||
బ్రహ్మదేవుని
తలపునను
అక్షర
పరబ్రహ్మ యోగమును
తెలిపి
పునః సృష్టి కారణమైన
పరబ్రహ్మవు
నీవేనయ్యా ||6||
మంగళ
రూపం ధరించి
శృంగారముగ
భావించి
అంగనలతో నీవుంటివని
భంగ
పడెనయ్యా దేవేంద్రుడు || 7||
నీ నిజరూపం తెలియగను
నీ మహిమలను స్మరియింప
నీ కృప వారిపై వర్షించి
నిజ
తత్వమును తెలిపితివి || 8||
జంభాసురుని
తాకిడికి
తాళగలేక
పోతినని
దేవేంద్రుడు
నిను ప్రార్థింప
అసురుని
ద్రుంచిన అనఘాప్రియా || 9||
స్మర్తృగామి
యని తెలుసుకొని
దలాదనుడు
నిను స్మరియింప
ప్రత్యక్షంబై
నిలచితివి
వజ్రకవచము
బోధించితివీ || 10||
కార్తవీర్యుని
రక్షించి
సహస్ర
బాహుల బలమొసగి
అష్ట
సిద్ధుల నిచ్చితివి
అమిత
పరాక్రమము జేసితివి || 11||
అశాంతి
నొందిన రేణుక పుత్రుడు
శాంతి
కోసమై అలమటించగా
సంవర్తనావధూత
రూపమున
శాంతి
నొసగి బ్రోచితివి || 12||
శ్రద్ధాభక్తి
తో భార్గవరాముడు
నిన్ను
దరిచేరి సేవించగా
త్రిపురా
రహస్యం ప్రబోధించిన
త్రిశక్తి
రూపుడు నీవేనయ్యా || 13||
మదాలసా
మాత సంకల్పం
అలర్కుడు
నిను చేరగనే
ముప్పు
తిప్పలు పెట్టితివి
మురిపెముతో
దరిచేర్చితివి || 14||
బ్రహ్మరాక్షసుని
సాయమున
విష్ణుదత్తుడు
నిను చేరగనే
ముప్పుతిప్పలు
పెట్టితివి
మురిపెముతో దరి
చేర్చితివి || 15||
విష్ణుదత్తుడు
కోరగనే
పితృ
కార్యమున కొచ్చితివి
సుశీలమ్మ పిలువగనే
అనలు
గు - సూర్యుడు
వచ్చిరయా || 16||
కోరిక
లేమియు లేనట్టి
ఆ దంపతులని దీవించి
అద్భుతమైన
మంత్రము నొసగి
జనహితకారిని
చేసితివి || 17||
కాశీ
లో నీ స్నానమట
కొల్హాపురి
లో భిక్షమట
చంద్రభాగ
లో చేతిని కడిగి
తుంగభద్ర
లో నీటిని తాగి || 18||
సహ్యాద్రిపురమున
వాసమట
మహూరుగడ
లో నిద్రయట
చిత్రమయా
నీ సంచారం
యోగీశ్వరేశ్వర
చక్రవర్తీ || 19 ||
కలియుగ
మందున శ్రీపాదుడై
గురుభక్తులను
బ్రోచితివీ
నరసింహ
సరస్వతీ స్వామిగ నీవు
గురుభక్తి
ని ఇల చాటితివి || 20||
మాణిక్య
ప్రభువుగ లీలలు చూపి
స్వామి
సమర్దగా భక్తుల గాచి
సాయినాధుడై
షిరిడీ లో వెలసి
ఆశ్రితులను
గాపాడితివి || 21 ||
నిరతము
నిన్ను స్మరియించే
విఠలుడు
పలికిన పలుకులివి
పలికిన
వారిని పరిరక్షించు
వల్లభాపురవాస
గురుదత్తా || 22 ||
శ్రీ
గురుచరితము చదవండీ
సద్గురు
శక్తిని తెలియండీ
భక్తి
తో మీరు కొలవండీ
దత్త
దేవా కృప పొందండీ || 23 ||
మంగళమయ్య
గురుదేవా
సచ్చిదానంద
సద్గురుదేవా
మంగళకరుడవు
నీవయ్యా
భక్తుల
బ్రోవుము గురుదత్తా
Thx a lot
ReplyDeleteTq sir
ReplyDeleteThank you for the spiritual support
ReplyDeleteJai guru deva datta
ReplyDeleteVerse 14, last 2 lines are wrong. It should be
ReplyDeleteయోగ విద్యను తెలిపితివి
యోగీశ్వరునిగ జేసెతివి
Sree Dattatreya swamy..Jai guru datta
ReplyDeletePlease upload shiva chalisa in Telugu
ReplyDeleteThank you 🙏🏻
Thank you 🙏🙏🙏
ReplyDeleteజై గురుదత్త చాలా సంతోషకరమండి శ్రీ గురు చరిత్ర చదివినంత సేపు చాలా ఆనందాన్ని కలిగింపజేస్తుంది
ReplyDelete